Friday, October 18, 2013

Related to Diwali

దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. 

ఐదు వత్తులు : 
దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు. దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి. 

ఏ నూనె మంచిది : ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. 

వేప నూనె రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది. 

నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు. 

దీపం సకల దేవతాస్వరూపం 
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం. 

దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విస్ఫలింగం లక్ష్మీ దేవి. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.

About ladies

అమ్మాయిల మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టమని చాలా మంది అంటుంటారు. మరి వారిని అర్థం చేసుకోవడం ఎలా అని అనుకుంటున్నారా... అయితే ఈ టిప్స్ పాటించండి

1. అశ్లీలంగా మాట్లాడితే వినడానికి ఏ అమ్మాయి ఆసక్తి చూపదు.
2. వారు స్పెషల్ అని మీరు ఫీలవడాన్ని ఎంజాయ్ చేస్తారు. (స్పెషల్ కాకపోయినా కూడా!).
3. సీరియస్‌గా ఉండేవారితో స్త్రీలు చనువును కోరుకోరు. అది భర్తయినా సరే.
4. ఏ అమ్మాయితోనూ గొడవలతో విడిపోవద్దు. ఇష్టం లేదన్న విషయాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిల్లో క్షణికావేశం ఎక్కువ.

5. పాత సూత్రమే అయినా..... కళ్లలోకి కళ్లు పెట్టి (కాస్త డిస్టెన్స్ నుంచి) చూస్తే ఆమె మనసులో చొరబడటం సులువు.
6. నిజాయితీతో, మనసుతో చెబితే ఏ అమ్మాయి అయినా ఆలోచిస్తుంది.
7. భావోద్వేగాలను అణుచుకోవడం స్త్రీలకు తెలిసినంతగా పురుషులకు తెలియదు.
8. అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటుంది.